1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tamanna Bhatia Live show

తమన్నా భాటియా లైవ్ చాట్.. తెల్లగా వున్నావని పొగరా?

సినీనటి తమన్నా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది. అయితే ఓ అభిమాని నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో లైవ్‌ఛాట్‌తో ఆకట్టుకుంటూ ఆయా తారలు తమ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇలా

Tamanna Bhatia
సినీనటి తమన్నా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది. అయితే ఓ అభిమాని నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో లైవ్‌ఛాట్‌తో ఆకట్టుకుంటూ ఆయా తారలు తమ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇలా తమన్నా కూడా ఫ్యాన్స్‌తో లైవ్ ఛాట్ నిర్వహించింది. 
 
అందులో ఒక అభిమాని ''తెల్లగా ఉన్నావని పొగరా? నాకెందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటూ కోపంతో తమన్నాను ప్రశ్నించాడు. అయితే దీనిని లైట్ తీసుకున్న తమన్నా "అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'' అంటూ సమాధానం చెప్పింది.
 
అనంతరం తాను చేస్తున్న.. చేయబోతున్న ప్రాజెక్టుల గురించి ఫ్యాన్స్‌కు తెలిపింది. సినిమాలు లేని తన జీవితాన్ని ఊహించుకోలేదని తెలిపింది. డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌‌లో రూపొందే సినిమాలో నటించాలనేదే తన కలంటూ చెప్పుకొచ్చింది.
About Writer
selvi
తర్వాతి కథనం
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్బుమణి కావాలి : చారుహాసన్