మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (13:42 IST)

హైదరాబాద్‌లో రిలయన్స్ జియో 4జీ ఫోన్ల డెలివరీ స్టార్ట్

రిలయన్స్ జియో ఉచిత ఫోన్లు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. దీంతో ఈ ఫోన్లను బుక్ చేసుకున్న వారికి ఆ సంస్థ ప్రతినిధులు డెలివరీ ప్రారంభించారు. హైదరాబాదులోని కవాడిగూడలో ఇప్పటికే ఈ ఫోన్లు డెలివరీ అయ్యాయని

రిలయన్స్ జియో ఉచిత ఫోన్లు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. దీంతో ఈ ఫోన్లను బుక్ చేసుకున్న వారికి ఆ సంస్థ ప్రతినిధులు డెలివరీ ప్రారంభించారు. హైదరాబాదులోని కవాడిగూడలో ఇప్పటికే ఈ ఫోన్లు డెలివరీ అయ్యాయని కూడా రిటైలర్లు చెబుతున్నారు. ప్రీబుకింగ్ సమయంలో రూ.500 చెల్లించిన వినియోగదారులు... ఇప్పుడు మిగిలిన రూ.1000 కూడా చెల్లించి, ఫోన్లను పొందవచ్చని వారు చెప్పారు.
 
ఇప్పటికే డెలివరీ ప్రారంభించామనీ, రెండు మూడు రోజుల్లో ప్రీబుకింగ్ చేసుకున్నవారందరికీ ఫోన్లను అందచేస్తామని చెపుతున్నారు. జియో ఫోన్లను తొలుత గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ చేశారు. నవరాత్రుల సందర్భంగా పల్లె ప్రజలకు ముందుగా ఫోన్లను అందించాలనే ఉద్దేశంతోనే, పల్లెల్లో ఫోన్లను డెలివరీ చేశామని జియో ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెల్సిందే.