1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tammareddy Bharadwaj comments on Chicago Prostitute case

ఇలా రాసి ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాకుండా చేస్తారా? 'తార్చేవాడు' అని రాయండి...

చికాగో వ్యభిచారం కేసుపై మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పట్టుబడిన జంట సనిమా ఇండస్ట్రీలో వున్నారా లేదా అనేది తెలియదు. అక్కడ అమె

Tammareddy Bharadwaj
చికాగో వ్యభిచారం కేసుపై మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పట్టుబడిన జంట సనిమా ఇండస్ట్రీలో వున్నారా లేదా అనేది తెలియదు. అక్కడ అమెరికా పోలీసులు అతడిని పింప్.. అంటే తార్చేవాడు అని చార్జిషీటులో రాశారు. మరి అలాంటప్పుడు మీడియా అతడిని నిర్మాత అని ఎందుకు రాస్తున్నట్లు? అని ప్రశ్నించారు. 
 
పోలీసులు వాడిన పదమే.. తార్చేవాడు అని రాయవచ్చు కదా. అలా కాకుండా నిజానిజాలు ఏమిటో తెలియకుండా ఏదిబడితే అది రాసేస్తున్నారు. అందువల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు రాకుండాపోయే ప్రమాదం వుంది. అసలు ప్రపంచంలో ఏది జరిగినా తెలుగు సినిమావారే బలైపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇది చాలా బాధాకరం. 
 
ఇలాగే ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుంటూ వెళితే పరిస్థితి దిగజారి తెలుగు ఇండస్ట్రీకి మచ్చ ఏర్పడుతుందనీ, ఇదిలా సాగటానికి వీల్లేదన్నారు. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మీడియా పైన కూడా వుందన్నారు. తప్పు జరిగినప్పుడు దాని గురించి రాయాల్సిందే కానీ మరీ ఎవరో ఏదో చెపుతున్నారని దాన్ని పాపులర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
#biggboss12 సన్నీ బాటలో శాంతి డైనమైట్.. ఎవరామె?