1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Will Suma stop anchoring after Jayamma Panchayathi

యాంకరింగ్‌కు స్వస్తి పలుకనున్న యాంకర్ సుమ?

Suma Kanakala
బుల్లితెర యాంకర్ సుమ రాజీవ్ కనకాల సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయనకు గుర్తింపుతో పాటు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టిన యాంకరింగ్‌కు స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో సుమ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
సుమ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం "జయమ్మ పంచాయతీ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విజయ్ కుమార్ కాలివరపు తెరకెక్కించిన ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. 
 
ఈ నేపథ్యంలో సుమను ఓ చానెల్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సుమ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ సినిమా తర్వాత సుమ బుల్లితెరకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా? యాంకరింగ్‌ను వదిలేస్తుందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. బుల్లితెరను వదిలే చాన్సే లేదని తేల్చి చెప్పింది. ఇటు బుల్లితెరపై మెరుస్తూనే సినిమాల్లోనూ నటిస్తానని స్పష్టం చేసింది.
 
పైగా, తనకు అన్నంపెట్టి, ఓ గుర్తింపునిచ్చి ఇంత స్థాయికి తీసుకొచ్చింది బుల్లితెర అని అది తనకు తల్లిలాంటిదన్నారు. తల్లిని వదిలేసి ఎలా వెళ్తామని, దాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
 
తాను టీవీల్లో చేస్తూ సినిమాలకు వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారని, కానీ, చాలా మంది సినిమాలు చేస్తూ టీవీలోకి వస్తున్నారని చెప్పింది. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయని తాను అనుకుంటున్నట్టు చెప్పింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స‌ర‌దాగా సాగిన అశోకవనంలో అర్జున కళ్యాణం - రివ్యూ రిపోర్ట్‌