NBK111: ఏడు భాషల్లో మల్టీ లాంగ్వేజ్ కంటెంట్ లైనప్ ప్రకటించిన జీ5
ZEE5 announces content lineup across seven languages
భారతదేశంలోని ప్రముఖ స్టూడియోలు, దర్శకులు, కంటెంట్ క్రియేటర్స్‌తో కలిసి ZEE5 ఈ భారీ ప్రాజెక్స్‌కు రూపకల్పన చేస్తోంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్, తమిళంలో ఫ్యాషన్ స్టూడియోస్, కన్నడలో కెవిఎన్ ప్రొడక్షన్స్, మలయాళంలో తెస్పియాన్ ఫిల్మ్స్, మరాఠీలో బహవా ఎంటర్‌టైన్‌మెంట్, ప్రతిసాడ్ ప్రొడక్షన్స్, కైరా కుమార్ క్రియేషన్స్, బెంగాళీలో అక్రోపోలిస్ ఎంటర్‌టైన్మెంట్, అంజన్‌దత్ ప్రొడక్షన్స్, వై సో సీరియస్ ఫిల్మ్స్, సురేందర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలతో జీ5 చేతులు కలిపింది.
హిందీలో జీయో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్, 200 నాటవుట్ సినిమాస్, డిఐసిఇ మీడియా, కలెక్టివ్ స్టూడియోస్, హిస్టరీవెర్సె, టిప్స్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్, ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, జార్ పిక్చర్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా జీ5తో చేతులు కలిపాయి.
హిందీ కంటెంట్ లైనప్‌లో కొత్త ఒరిజినల్స్, ఐకానిక్ ఫ్రాంచైజీల రీ-ఎంట్రీలు, భారీ సినిమాలు కలిపి ఒక స్ట్రాంగ్ మిక్స్‌గా రూపొందించారు. కొత్త సిరీస్‌లలో కాంబ్లీ (క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితంపై ప్రేరణతో), ది స్కామ్ లీక్డ్, కాఫీ కింగ్, జీనా ఐసీ కా నామ్ హై 2.0(ఆర్.మాధవన్ హోస్ట్‌గా), ఐకానిక్ జీ హారర్ షోతో పాటు రంగ్‌బాజ్ ఎస్4(మోహిత్ రైనా, అరుణోదయ్ సింగ్), జవావర్2(బువన్ అరోరా),బకైతి ఎస్2 (రాజేష్ తేలంగ్, షీబా ఛద్ధా) వంటి ఫ్రాంచైజీలు సందడి చేయనున్నాయి.
సినిమాలను గమనిస్తే.. థియేట్రికల్ రిలీజ్‌లైన తర్వాత స్ట్రీమింగ్ కాబోయే సినిమాలతో పాటు డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్‌ల కాంబో కూడా కనిపిస్తోంది. హై జవానీతో ఇష్క్ హోనా హై (వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మౌని రాయ్), బండార్ (బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా), భారత్ భాగ్య విధాత (కంగనా రనౌత్), పూజా మేరీ జాన్ (మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ), సర్వ్‌గుణ్ సంపన్న్(వాణీ కపూర్), ఘమాసాన్ (అర్షద్ వార్సీ, తిగ్మాంశు ధూలియా, ప్రతీక్ గాంధీ), ఇక్రూప్ (మిథిలా పాల్కర్, గౌహర్ ఖాన్), దలింప్ (జితేంద్ర కుమార్, ప్రియా బాపట్) వంటి ప్రాజెక్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొత్త కథలతో పాటు ప్రేక్షకులకు పరిచయమైన ఫ్రాంచైజీలను కూడా కలిపి ఈ లైనప్‌ను మరింత ఆసక్తికరంగా రూపొందించారు.
*తెలుగులో శ్రీమతి (నివేథా థామస్), అబ్జెక్షన్ మై లార్డ్ (శ్రీకాంత్) వంటి కొత్త ఒరిజినల్స్‌తో పాటు, బ్లాక్‌బస్టర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా మళ్లీ వస్తోంది. సినిమాల లైనప్‌లో వెంకీ అనీల్ రావిపూడి5, ఎన్‌బీకే111, వృషకర్మ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.*
తమిళంలో కూసే మునిసామి వీరప్పన్, తడయమ్ మళ్లీ వస్తుండగా కొత్త ఒరిజినల్స్‌గా అనంతకాలమ్, మొదటి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షోగా తీ కురల్ రానున్నాయి. సినిమాల విషయానికి వస్తే డీ మాంటే కాలనీ3. హై(నయనతార, కవిన్), రావాడి వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.
కన్నడలో అయ్యనా మానె కొత్త సీజన్‌తో మళ్లీ రాబోతోంది. అలాగే బిట్‌కాయిన్ స్కామ్, ఆపరేషన్ బంగార వంటి ఒరిజినల్స్ ఈ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. సినిమాల విభాగంలో రాజ్ బి. శెట్టి, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన కరవాలి యాడ్ కానుంది. మలయాళంలో ఏ క్వీన్, మలబార్ కప్,మలయాళం తొలి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షో కేరళ అండర్‌గ్రౌండ్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత ప్రశంసలు పొందిన బాలన్ ది బాయ్ కూడా ఇందులో భాగమైంది. మరాఠీలో హె కే నవీన్? కొత్త సీజన్‌తో పాటు అగ అయి, అహో ఆయి అనే కొత్త ఒరిజినల్, తుంబడ్చి మంజుల, భూతమ్ భయమ్ వంటి హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. బెంగాలీలో ప్రేక్షకుల ఫేవరెట్ షోలు శ్వేత్‌కాళి, లాల్ బజార్ కొత్త సీజన్‌లతో తిరిగి వస్తున్నాయి. అలాగే అలూర్ దోస్, ప్రియో బొంధు వంటి షోలు ఒరిజినల్స్ లైనప్‌ను మరింత బలపరుస్తున్నాయి. మొత్తంగా, ప్రతి భాషలో స్థానిక సంస్కృతి, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను అందిస్తూ జీ5 తన ప్రాంతీయ కంటెంట్‌ను మరింత విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ.. భారతీయ ప్రేక్షకుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలందించడం మా లక్ష్యం. ఈ లైనప్ కేవలం టైటిల్స్ జాబితా మాత్రమే కాదు. ఇది భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే స్వదేశీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎదగాలనే మా లక్ష్యానికి ప్రతిబింబం. దేశంలోని అత్యంత ఆసక్తికరమైన కథలు, ప్రముఖ క్రియేటర్లు, ధైర్యమైన ఆలోచనలు అన్నీ ఒకే వేదికపై కలిసే స్థలంగా ZEE5గా నిలవటమే మా లక్ష్యం” అని తెలిపారు.
