1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
  4. srivari bramhotsavam 2015

ఈరోజు రాత్రి శ్రీకృష్ణ స్వామి రూపంలో సర్వభూపాల వాహనంపై శ్రీవారు... విశిష్టత (వీడియో)

sarvabhupala vahanam
నాల్గవ రోజు రాత్రి జరిగే బ్రహ్మోత్సవంలో ఉభయదేవేరులతో కలసి స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. అదిదేవుడైన శ్రీహరి రాజధిరాజు. సమస్త భూమండలాన్ని పరిపాలించే రాజులు, మహారాజులందరు తన దాసులే అన్నది తన భక్తులకు తెలిజేసేందుకే స్వామివారు సర్వభూపాలుడిగా కనిపిస్తాడు.
 
అష్టదిక్పాలకులతో పాటు ప్రజలను పాలించే రాజులు, సర్వభూపాలవాహనంపై కొలువుదీరిన శ్రీనివాసుడిని మోసుకెళ్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. తనను భూజస్కందాలపై మోస్తు, హృదయంలోనూ త్రికరణశుద్ధిగా స్వామివారిని స్మరిస్తూ తద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలంటూ రాజోత్తములను ఆదేశిస్తారని పురాణ ప్రాశస్త్యం.
ఏడు అడుగులు కలిగిన బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనాన్ని సమరభూపాల వాహనమని కూడా పిలుస్తారు. సర్వభూపాల వాహనంలో స్వామివారు కాళియమర్థనం చేస్తున్న శ్రీకృష్ణస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి