సంబంధిత వార్తలు
- చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో విలన్గా రియల్ హీరో!!
- సుశాంత్ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడొద్దు.. కంగనాకు సోనూ కౌంటర్?
- కరోనా దెబ్బకు ఉద్యోగం ఊడింది... ఆ టెక్కీకి సోనూ సూద్ ఉద్యోగమిచ్చారు..
- నిజమైన ఆపద్బాంధవుడు : సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత?
- ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రానా నేను పేదను కాకుండా పోతానా? సోనూ మా దేవుడు..
పేదల పెన్నిది, మనసున్న మహరాజు సోనూసూద్, అదంతా ఆయన నిర్ణయమేనంటున్న రియల్ హీరో
సోనూసూద్ రీల్ లైఫ్‌లో విలన్ గానీ, లాక్ డౌన్ సందర్భంలో మాత్రం నిజమైన హీరోగా మారారు. వేల మంది వలస కార్మికులకు స్వస్థలాలకు పంపించి నిజ జీవితంలో సుప్రీంహీరోగా మారారు. వలస కూలీల కష్టాలకు చలించిపోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి ప్రశంసలు పొందారు.
అది అక్కడితో ఆగలేదు. లాక్‌డౌన్ వల్ల విదేశాలలో చిక్కుకున్న దాదాపు 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించే లోపే బస్సులు ఏర్పాటు చేసి వారిని తమ సొంత ఊర్లకు పంపించారు.
ప్రతి వలస కార్మికుడు తమ ఇంటికి చేర్చేంత వరకు ఆగలేదు. ఈ రియల్ హీరో సోనూసూద్ ఈ రోజు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మరో మంచి కార్యాన్ని తలపెట్టాడు. దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 50వేల మందికి ఉచిత వైద్యం అందిస్తానని తెలిపారు. అంతేకాదు, చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ ఇవ్వడంపై చెబుతూ.. అదంతా పైవాడి దయ అనీ, దేవుడు నిర్ణయం మేరకే ఏదైనా జరుగుతుందన్నారు. తన తాహతుకొద్దీ సాయం చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదన్నారు.
