గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (18:23 IST)

సుశాంత్ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడొద్దు.. కంగనాకు సోనూ కౌంటర్?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని కదిలించింది. సుశాంత్ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం మూగబోయింది. సుశాంత్ మరణంపై ఇప్పటికీ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ మరణం పై స్పందించిన బాలీవుడ్ నటుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ఇటీవలే సుశాంత్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు కారణమంటూ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సోనూసూద్ సుశాంత్‌ని ఒక్కసారి కూడా కలవని వారుండరు. అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నారని.. న్యాయపోరాటం చేస్తున్నారని.. ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ సోనుసూద్ వ్యాఖ్యానించారు. 
 
ఇలాంటి చర్యల వల్ల సుశాంత్ కుటుంబం ఎంతో బాధ పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. సుశాంత్ మరణాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చనిపోయిన వ్యక్తిని ప్రయోజనాల కోసం వాడుకోవడం హేయమైన చర్య అని సోనూసూద్ అభివర్ణించారు.