1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. KCR meet Stalin, Karunanidhi today for Federal Front pitch

చెన్నైలో కేసీఆర్.. కరుణానిధి - స్టాలిన్‌లతో సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఆదివారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నపట్టణం వచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు

KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఆదివారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నపట్టణం వచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు వెళ్లిన కేసీఆర్ 1.30 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. 
 
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, వినోద్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. డీఎంకే నేతలతో కీలక భేటీ అనంతరం హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు కేసీఆర్ బృందం చేరుకుంటుంది. తర్వాత షెడ్యూల్‌ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30కు ప్రగతి భవన్‌ చేరుకుంటారు. 
 
About Writer
pnr
తర్వాతి కథనం
ప్రజల కళ్లలో మోడీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది : రాహుల్