1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. amruthasar aalu

ఘుమఘుమలాడే అమృత్‌సర్ ఆలు

andhra recipes andhra vantallu andhra food
కావలసిన పదార్థాలు:
 
బంగాళదుంపలు - 150 గ్రా.
 
ఉల్లితరుగు - అరకప్పు, 
 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,
 
వాము - అర టీ స్పూన్,
 
శనగపిండి - 5 టీ స్పూన్లు,
 
ధనియాలపొడి - అర టీ స్పూన్
 
మిరప్పొడి - 2 టీ స్పూన్లు,
 
గరంమసాలా - అర టీ స్పూన్,
 
కొత్తిమీర - చిన్న కట్ట
 
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి తగినంత,

తయారుచేయండి ఇలా: మొదట బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. ఆ తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమ రంగువచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో ఉల్లి తరుగును కూడా వేసి బ్రౌన్‌గా వేయించాలి. అనంతరం తగినంత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తర్వాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే అమృత్‌సర్ ఆలు రెడీ. చివరిగా కొత్తిమీరను గార్నిష్ చేయాలి. అమృత్‌సర్ ఆలు పరాఠాలలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి.
 
About Writer
CVR