1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

ఉలవచారు

ఉలవచారు
కావలసిన పదార్థాలు :
ఉలవలు : 200 గ్రాములు
చింతపండు పులుసు : 3 టేబుల్ స్పూన్‌లు
నూనె : 3 టేబుల్ స్పూన్‌లు
పచ్చిమిర్చి : నాలుగు
పసుపు : 1/2 టీ స్పూన్‌
కొత్తిమిర : రెండు టీ స్పూన్‌లు
కరివేపాకు : 2 టీ స్పూన్‌లు
ఉప్పు : తగినంత

తయారీ విధానం :
మొదట ఉలవలు శుభ్రపరచి కనీసం రెండుగంటలు నానబెట్టాలి. అలా కాకున్నా రాత్రి నానబెట్టి ఉదయం చేసుకోవచ్చు. నాలుగు గ్లాసుల నీళ్ళు పసుపు కాస్త నూనె వేసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని గరిటతో మెదిపి ఉప్పు చింతపండు పులుసు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మరగనిచ్చి కొత్తిమిర వేసి పోపు పెట్టాలి.
About Writer
PNR