సంబంధిత వార్తలు
- పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?
- Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు
- 130 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి... హెవీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?
- రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ
సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి
Mixture
తనిఖీల్లో భాగంగా.. తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన నాణ్యత లేని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని తక్షణమే మున్సిపల్ చెత్త వాహనంలో పారవేయించి ధ్వంసం చేశారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మున్సిపల్ అధికారులు సదరు యాజమాన్యానికి రూ. 1 లక్ష భారీ జరిమానా విధించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం స్వీట్ తయారీ కేంద్రంతో పాటు విక్రయ దుకాణాన్ని పూర్తిగా సీజ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ప్రకటించారు.
