కాకరకాయ కూర
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు... అరకేజీ
ఉప్పు... ఒక టీస్పూన్
ఉల్లిపాయలు... రెండు
కారం... ఒక టీస్పూన్
పచ్చిమిర్చి... మూడు
పసుపు... అరటీస్పూను
నూనె... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
కాకరకాయల పైపొట్టు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తరువాత వాటిల్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులోని నీటిని వంపేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి.. మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను ఉడికించిన కాకరకాయలకు పట్టించాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనెను వేసి కాకరకాయ ముక్కల్ని బాగా వేయించి కారంచల్లి మరి కాసేపు ఉంచి దించేయాలి. అంతే కాకరకాయ కూర రెడీ.