కొత్తిమీర రైస్
ఎలాంటి వంటకానికైనా సరే చివర్లో కొత్తిమీర చేరిస్తే వచ్చే రుచిని చెప్పనక్కర లేదు. అదొక్కటే కాదు, కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన నుండి కూడా కాపాడుతుంది. ఎప్పుడూ వంటలమీద అందంగా అలంకరించేందుకో, రుచికో కాకుండా... ఆరోగ్యానికి పనికొచ్చే విధంగా ఈసారి ఇలా చేసి చూడండి.
కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
కొత్తిమీర... పెద్దసైజువి ఏడు కట్టలు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
దాల్చిన చెక్క... చిన్న ముక్కలు రెండు
లవంగాలు... ఆరు
నూనె... సరిపడా
తయారీ విధానం :
ముందుగా అరకేజీ బియ్యాన్ని ఉడికించి పొడి పొడిగా ఉండేలా అన్నం వార్చుకోవాలి. కొత్తిమీరను తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత బాణలిలో సరిపడా నూనె పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిల పేస్ట్, చెక్క, లవంగాలు, వేసి కాసేపు వేయించాలి. ఆపై కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న అన్నంలో పై మిశ్రమాన్ని, తగినంత ఉప్పును కలపాలి. అన్నం మొత్తం కొత్తిమీర మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే కొత్తిమీర రైస్ రెడీ అయినట్లే...!
అవసరమైతే లేదా కావాలనుకునేవారు కాసిన్ని జీడిపప్పులను వేయించుకుని చివర్లో అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. టొమోటోలతో తయారు చేసిన పెరుగు చట్నీ ఈ కొత్తిమీర రైస్‌కు చక్కటి కాంబినేషన్ అని చెప్పవచ్చు.