1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

క్యారెట్ అన్నం

క్యారెట్ అన్నం బియ్యం
క్యారెట్ అంటే కొంత మందికి చాలా ఇష్టం. కొందరికి అసలు నచ్చది. అయితే క్యారెట్ అన్నంగా చేస్తే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు.

కావాల్సిన పదార్థాల
బియ్యం- రెండు పెద్ద గ్లాసులు
క్యారెట్ తురుము- 2 కప్పులు
ఉల్లి-1
శెనగపప్పు- గరిటెడు
మినప్పప్పు- గరిటెడు
ఆవాలు, జీలకర్ర, గరం మసాలా- తగినంత
వేయించిన వేరు శెనగ- పిడికెడు
కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు- తగినంత
నూనె- రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
బియ్యం పూర్తిగా ఉడకక ముందు పొడిపొడిగా ఉన్న సమయంలోనే తీసి, తగినంత ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. అన్నంను ఓ పాత్రలో తీసుకుని ఆరబెట్టాలి. స్టవ్‌పై బాణలి పెట్టి, నూనె కాగబెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాళింపులా చేయాలి.

అందులోనే శెనగపప్పు, ఉద్దిపప్పు చేర్చి బాగా వేయించాలి. తర్వాత ముక్కలుగా నరికిన పచ్చి మిరపకాయలు, ఉల్లి చేర్చి మిక్స్ చేసి, క్యారెట్ తురుమును అందులో చేర్చండి.

క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడకబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టిన అన్నంలో కలపండి. వేయించిన వేరుశెనగ పప్పులను బద్దలుగా చేసి, అన్నంలో బాగా కలపండి. ఇక కరివేపాకు, కొత్తిమీరలను పైపైన చల్లి, వేడిగా వడ్డించండి.