టొమోటోలతో పెసల సబ్జీ
కావలసిన పదార్థాలు :
పొట్టు తీయని పెసళ్లు... ఒక కప్పు
ఉల్లిపాయలు... రెండు
టొమోటోలు... రెండు
పచ్చిమిరపకాయలు... రెండు
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా
మంచినీరు... పావు లీ.
కొత్తిమీర తరుగు.. కొద్దిగా
ఉల్లితరుగు... రెండు టీ.
తయారీ విధానం :
పెసరపప్పును ఒకరోజంతా నానబెట్టి, మొలకలు వచ్చేలా చేయాలి. ఆ తరువాత ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా తరిగాలి. అందులో సగం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటోలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి మిగిలిన ఉల్లిముక్కలను వేసి గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. అందులోనే గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి మరో మూడు నిమిషాలపాటు వేయించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, ఉప్పు, తగినంత నీరు పోసి తక్కువ మంటమీద పది నిమిషాలు ఉడికించి దించాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చి ఉల్లితరుగులను చల్లి సర్వ్ చేయాలి.