1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

దొండకాయ కూర

దొండకాయలను నీటిలో కడిగి పావు అంగుళం సైజు ముక్కలుగా తరిగి ఉడికించాలి. ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి
కావలసినవి :

దొండకాయలు - పావుకిలో
నీరుల్లి - 2 (చిన్నవి)
పచ్చిమిర్చి - 10
పచ్చికొబ్బరి - పావుచిప్ప
ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్‌
పంచదార - 1 టీస్పూన్‌
లవంగం - 1

ఇలా చేయండి :

దొండకాయలను నీటిలో కడిగి పావు అంగుళం సైజు ముక్కలుగా తరిగి ఉడికించాలి. ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, లవంగం, కొబ్బరిముక్క వీటిని మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నెపెట్టి 4 టీస్పూన్ల నూనె, అర టీస్పూన్‌ ఆవాలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిముక్కలను వేయాలి. ఉల్లిముక్కలు దోరగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి, అవి వేగిన తర్వాత దంచిపెట్టుకున్న కారం, రెండు చిటికెల పసుపు, పంచదార వేసి రెండు నిమిషాలు వేయించి దించాలి. వడ్డిస్తే దొండకాయ వేపుడు నిముషాల్లో ఖాళీ...