1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

బెండకాయ పచ్చడి

బెండకాయ పచ్చడి ఎండు మిర్చి చింతపండు మినపప్పు
కావలసిన పదార్థాలు :
బెండకాయలు- 15
ఎండు మిర్చి-9
నూనె- 50 గ్రాములు
చింతపండు- కొంచెం
మినపప్పు-1 చెంచా
అల్లం, కరివేపాకు-కొంచెం
ఉప్పు , పసుపు- తగినంత

తయారీ విధానం :
ముందుగా బెండకాయలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తరువాత ముక్కలను చేసి గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. బాండీలో నూనె వేసి మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, నూరిన అల్లం వేసి వేయించాలి. వేగిన తర్వాత మగ్గిన బెండకాయ ముక్కలు వేసి అందులో చింత పండు, ఉప్పు, పసుపు వేసి బాగా నూరాలి. తరువాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే బెండకాయ పచ్చడి రెడీ.