1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. మెంతులతో పులుపు కూర

మెంతులతో పులుపు కూర

వంటకాలు శాకాహారం మెంతులు జీలకర్ర అల్లం పసుపు చింతపండు ఉప్పు పంచదార నూనె
కావలసిన పదార్థాలు :
మెంతులు... 200 గ్రా.
జీలకర్ర... రెండు టీ.
అల్లంముక్క... చిన్నది
పసుపు... అర టీ.
చింతపండు... 50 గ్రా.
ఉప్పు... సరిపడా
పంచదార... నాలుగు టీ.
నూనె... ఆరు టీ.

తయారీ విధానం :
మెంతులు నానబెట్టి ఉంచాలి. చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన మెంతులను నీటిలో ఉడికించి, నీళ్లు వార్చేయాలి. పొయ్యిమీద పాన్ పెట్టి నూనె వేసి, బాగా కాగాక జీలకర్ర వేసి కొద్దిగా నీరుపోసి మెంతులను వేయాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా అందులోనే వేసి ఉడికించాలి.

తరువాత చింతపండు పులుసు పోసి, కొంచెం ఉడికిన తరువాత పంచదార, పసుపు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. ఇది బీపీ, షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. మెంతులు బాగా చేదుగా ఉంటాయి కదా, ఈ కూర ఎలా తినడం అని సందేహించవద్దు. ఎందుకంటే, ఈ కూర అస్సలు చేదుగా ఉండదు, పైగా మంచి రుచిగా ఉంటుంది కూడా...!!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి