1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

రవ్వ దోసె

వంటకాలు శాకాహారం బియ్యంపిండి మైదా బొంబాయి రవ్వ జీలకర్ర ఉప్పు నెయ్యి
FileND
కావలసిన పదార్థాలు :
బియ్యపుపిండి... పావు కేజీ
మైదా... అర్థపావు కేజీ
బొంబాయి రవ్వ... అర్ధపావు కేజీ
జీలకర్ర... ఒక చెంచా
ఉప్పు... సరిపడా
నెయ్యి లేక నూనె... సరిపడా

తయారీ విధానం :
మైదాను, బొంబాయి రవ్వను శుభ్రపరచుకొని, ఒక గిన్నెలో పోసి బియ్యం పిండిని కూడా వేసి నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు గంటల సేపు నానబెట్టాలి.

తరువాత పొయ్యిమీద పెనం పెట్టి కాలనిచ్చి కలిపి నానిన పిండిలో ఒక టీస్పూను జీలకర్ర సరిపడా ఉప్పువేసి బాగా కలిపి పెనం మీద ఒక టీస్పూను నూనె వేస్తూ కలిపిన పిండి పోసి పలుచగా నెరపాలి. కాలే దోశె మీద మళ్ళీ ఒక చెంచా నూనె వేసి దోశెను తిరగవేసి తీసి... వేడి వేడిగా ఆరగించాలి. దీనికి సైడ్‌డిష్‌గా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి