1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

వెజ్, నట్ సలాడ్

వెజ్
కావలసిన పదార్థాలు :
అక్రూట్ ముక్కలు -1/4 కప్పు
బనానా-1
ఆపిల్-1
చెర్రిస్ -10
నల్లద్రాక్ష-10
పైనాపిల్ పీసెస్-అరకప్పు
కమలాపండు-1
ద్రాక్ష-10
డ్రెసింగ్‌కి కావలసినవి
ఫ్రెస్‌గా ఉన్న కమలాపండు రసం-4 చెంచాలు
నిమ్మరసం-2 చెంచాలు
కార్న్‌ఫ్లోర్-సరిపడ
ఉప్పు-1/2 చెంచా
కాస్టర్ షుగర్-అరకప్పు
క్రీం-1 కప్పు

తయారీ విధానం :
ముందుగా కమలాపండు తొక్కుతీసి విత్తనాలు తీసి చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆపిల్‌ను సన్నగా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అరటిపండు తొక్కుతీసి స్లయిసెస్‌‍గా కట్ చేసుకుని, ఒక బౌల్‌లో ఆపిల్ ఫైనాపిల్ పీసెస్ కమలాతొనల ముక్కలు, అరటిపండుస్లయిసెస్, అక్రూట్ ముక్కలు వేసి కలిపి ఉంచాలి.

వీటిని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టకోవాలి. తర్వాత సాస్ ప్యాన్‌లో కమలాపండు రసం, నిమ్మరసం, కాస్టర్ షుగర్ వేసి వేడి చేసుకుని, కార్న్‌ఫోర్‌ను కొద్దిగా నీటిలో కలిపి పంచదార మిశ్రమంలో పోసుకోవాలి.

సన్నని మంట మీద కలుపుతూ ఉడికించుకుని, ఆ మిశ్రమం చిక్కబడిన తరువాత దించి చల్లారనిచ్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయిన తరువాత క్రీం వేసి బాగా కలుపుకోవాలి. సర్వ్ చేసే ముందు ఐస్ క్రీం బౌల్స్‌లో ఫ్రిజ్‌లోని ఫ్రూట్ పీసెస్‌ను పెట్టి వాటి మీద క్రీంను పలుచగా పోసుకుని, ఆ క్రీం మీద ద్రాక్ష, నల్లద్రాక్ష, చెర్రి ఒక్కొక్కటి పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.