సంబంధిత వార్తలు
- గన్నేరు, గరికతో వినాయకుడిని పూజిస్తే? గరికను బీరువాలో ఉంచితే?
- ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్స్‌తో పండగ చేస్కోండి...
- కమల్ హాసన్‌తో ఆ ముగ్గురు.. వాణీ గణపతి, సారిక, గౌతమి.. ఎలా దూరమయ్యారంటే?
- తిరుపతిలో ఆకట్టుకుంటున్న ప్రత్యేక హోదా వినాయకుడు
- దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ఫోటోలు.. ఆలయాల్లో రద్దీ..!
వినాయకుడిని మెట్లకింద వుంచి పూజ చేయొచ్చా?
వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి సమర్పిస్తుంటాం. అయితే విఘ్నేశ్వరుడిని ఏ దిశలో వుంచి పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. వినాయక చవితి రోజు
వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి సమర్పిస్తుంటాం. అయితే విఘ్నేశ్వరుడిని ఏ దిశలో వుంచి పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. వినాయక చవితి రోజున వినాయక ప్రతిమను పూజ గదిలో వుంచి పూజ చేస్తుంటాం. అయితే వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎప్పుడూ ఎడమవైపు చూసేలా వుంచాలి. బొజ్జయ్య తల్లి పార్వతీ దేవిని ఆ తొండం చూసేలా వుండాలి.
వినాయకుడిని ప్రతిమ వెనుక భాగం.. ఏ గదిని చూసేలా వుంచకూడదు. ఇది చీకటిని సూచిస్తుంది. కాబట్టి.. గణపయ్య వీపుభాగం వాకిలిని చూసేట్లు వుంచాలి. ఇంట్లోని దక్షిణ దిశలో వినాయకుడిని వుంచి పూజించకూడదు. తూర్పు, పడమర వైపున వుంచి పూజ చేయొచ్చు. ఇంకా బాత్రూమ్‌ను కనెక్ట్ అయిన గోడను ఆన్చి వినాయకుడిని వుంచకూడదు.
అంతేగాకుండా.. గోడకు ఆన్చి వినాయకుని ప్రతిమను ఉంచకూడదు. లోహంలో చేసిన విఘ్నేశ్వరుడిని తూర్పు, పడమర దిశలో వుంచి పూజించాలి. ఇంకా ఈశాన్య దిశలో వినాయకుడిని వుండి పూజించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. అలాగే మెట్ల కింద వినాయకుడిని వుంచి పూజించడం చేయకూడదు. అలా చేస్తే.. మెట్లు ఎక్కేటప్పుడు విఘ్నేశ్వరుడిని తలపై నడుస్తున్నట్లు అవుతుంది. ఇది దురదృష్టానికి కారణమవుతుంది.
తర్వాతి కథనం
