1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Stock must for Soup taste

సూప్ రుచిగా రావాలంటే ఏం చేయాలి?

Stock must for Soup taste
సూప్ రుచిగా ఉండాలంటే స్టాక్ కీలకం. స్టాక్ అంటే కూరగాయలు ఉడికించిన నీళ్లు. కేవలం కూరగాయలు ఉడికించిన నీళ్లే కాదు.. చికెన్ స్టాక్, ఫిష్ స్టాక్, బ్రౌన్ స్టాక్ వంటివి కూడా సూపర్ బజార్లలో రెడీమేడ్‌గా దొరుకుతాయి. సూప్ తయారీలో ఈ స్టాక్‌ని ఉపయోగించినప్పుడే రుచి బాగుంటుంది. దీన్ని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం.. 
 
అడుగు మందంగా ఉండే వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలూ, బిర్యానీ ఆకులు, మిరియాలు, ఆలివ్ నూనె, ఉప్పూ వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులో అన్నిరకాల కూరగాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి మూడొంతుల వరకు నీళ్లు పోయాలి.

ఈ నీరు బాగా మరిగి పైన పొంగులా వస్తుంది. దానిని వేరుచేస్తూ ఒక వంతుకి వచ్చేంతవరకు నీటిని మరిగించి వడకట్టాలి. ఈ నీటినే స్టాక్ అంటారు. దీనిలో పోషకాలు అధికం. ఈ స్టాక్‌ని డీప్ ఫ్రిజ్‌లో భద్రపరుచుకొని సూప్‌లు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. 
About Writer
Selvi