శుక్రవారం, 20 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (17:41 IST)

మహిళలూ ప్రయాణంలో పొదుపు ఎలా చేయాలంటే.?

పర్యటనల్లో ఖర్చు చేయి దాటిపోతుంటుంది. అందుకే చాలా మంది పర్యటనలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒక్క నీటి బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. లేదంటే దాహమైన ప్రతీసారి నీళ్ల బాటిల్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. 
 
* కొత్త ప్రదేశాలలో చిరునామాలు తెలియక ఇబ్బందితో పాటు స్థానిక ప్రయాణానికి ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకు బస్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ వంటి వివరాలతో పాటు హోటల్ గదులు, దేవాలయాలు, ఇతర చూడదగిన ప్రదేశాల గురించి అక్కడ ప్రాంత వాసులనే అడిగితే సమయం డబ్బు ఆదా అవుతాయి. 
 
* కొత్త ప్రదేశాల్లో వస్తువులను కొనుగోలు చేసేముందు మన ప్రాంతంలోనూ ఆ వస్తువులు దొరుకుతున్నాయా అనే విషయాన్ని గమనించండి. ప్రయాణాల్లో ఏరియా మ్యాప్స్ దగ్గర ఉంచుకొని, వాటిలో సూచనలను అనుసరిస్తూ వెళ్లడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి.