అవాంఛిత రోమాలతో సమస్యలా..!!
FILE
దాంతో పాటు... ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో రకరకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. అందులో...
పాట్‌వ్యాక్స్ :
ఇవి చిన్నచిన్న పాత్రల్లో వస్తాయి. పై పెదవి, ముఖంపైన ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించేందుకు ఇవి సరైన ఎంపిక. కానీ దీనివల్ల చాలా త్వరగా అంటే మూడో రోజుకే మళ్లీ సమస్య మొదలవుతుంది.
కోల్డ్ వ్యాక్స్ :
దీన్ని పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి. సరిగ్గా తొలగించలేకపోతే.. చర్మం పైపొర కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.
హాట్ వ్యాక్స్ :
ఈ రోజుల్లో చాలామంది దీన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అవాంఛిత రోమాల్ని సులువుగా తొలగిస్తుంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో వేసుకోవాలి.
* వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి.
* వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.
* వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి.
* బహుమూలాల్లో చేస్తున్నప్పుడు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి ఐదునిమిషాల అనంతరం వ్యాక్సింగ్ చేసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది.
* ముఖానికి వ్యాక్సింగ్ చేసుకుంటున్నప్పుడూ రెండు మూడు అంగుళాల మేర వేసి.. ఆ భాగం సాగకుండా బొటనవేలు, చూపుడు వేలితో గట్టిగా నొక్కిపట్టుకుని వ్యాక్స్ పట్టీతో తొలగించాలి. అప్పుడు చర్మం కంది పోకుండా.. దద్దుర్లు రాకుండా ఉంటుంది.

