1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Neck

మహిళల వయస్సు తెలిపే మెడ!

మహిళ
FILE
ఒక అమ్మాయి మెడ చూసిన వెంటనే వారి వయస్సు చెప్పేయచ్చు. దానికి కారణం మెడ యందు ఏర్పడే మడతలు, గీతలు. మృదువైన మెడపైన ఇలాంటి మడతలు ఉండుట కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కాని క్రింది తెలుపబడిన చిట్కాలు చేసినట్లైతే అందమైన, మెడ పొందవచ్చును.

రోజు చేయవలసిన మెడ ఆసనాలు:

* తలని వెన్నక్కి 10 సార్లు, ముందుకు 10 సార్లు కదిలించాలి.

* తలని బాగా వెనుకకి వాల్చి, నోటిని బాగా తెరచి కదిలించి మూయవలెను.

* తలని ఒక పక్క నుండి వేరొక్కపక్కకి కదిలించాలి. తరువాత తలని కుడి భుజము తాకు వరకు తీసికెళ్ళి, మళ్ళీ ఎడమ వైపు భుజమువరకు తీసుకొని పోవలెను. ఇదేవిధంగా 10 నుంచి 20 సార్లు చెయ్యాలి.

మెడ జాగ్రత్తలు:

* నడిచేటప్పడును, కూర్చునేటప్పుడునూ, తలని వెనుకకు వాల్చినట్లు ఉంచవలెను.

* దుమ్ము, దూళి, ఎండ మొదలగు వాటి నుంచి శరీరమును కాపాడుకొనవలెను. ఈత నేర్చుకునే వారు ఈత తరువాత, మంచి నీటిలో మళ్ళీ స్నానం చేయాలి. ఉప్పు, మరియు క్లోరిన్ నీటి నుండి శరీరమును కాపాడుకొన వలెను.

* మెడ భాగమును బిగుతు చేసే క్రీములు వాడవచ్చును. క్రీమ్‌ని పైభాగమునకు మసాజ్ చేయు విధముగా వాడవలెను.

* ముఖమునకు ఇచ్చు జాగ్రత్తలు, మెడకు కూడా ఇవ్వవలెను.

* మెడకు మాస్క్, మసాజ్ మొదలగు జాగ్రత్తలు చాలా ముఖ్యం