Astrology Zodiac Pisces Hom.htm

Notifications

మీనం మీనం
గృహం మరియు కుటుంబం

మీన రాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తిస్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయటా అందరి మన్ననలు పొందగలుగుతారు.

మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?

మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?నామినేషన్ పత్రం పూర్తిగా పూరించలేదన్న కారణంతో మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి శ్రీనివాస రావు నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీనితో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగలినట్లయ్యింది. జనసేన అభ్యర్థి నామినేషన్ పైన 9 మంది చైర్మన్ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు సేఫ్టీగా జనసేన చైర్మన్ అభ్యర్థి తన కుటుంబ సభ్యులకు సంబంధించిన నలుగురితో నామినేషన్ వేయించారు. ఐతే ఆ నామినేషన్ పత్రాల్లో కూడా ఖాళీలు వుండటంతో ఎన్నికల అధికారులు వారి నామినేషన్ పత్రాలను కూడా తిరస్కరించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని జనసేన తరపు న్యాయవాది వెల్లడించారు.

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహంమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు.