Author Indiaprwire 32.html

Notifications

national news
/indiaprwire/
pr

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్తఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అదేమిటంటే... మరో 48 గంటల్లో కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలియజేసింది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాలపై వుంటుందని వెల్లడించింది. విశాఖపట్టణం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసారు. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు తీవ్రంగా విస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన చేసారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడవచ్చు కనుక పక్కా ఇళ్లలో తలదాచుకోవాలనీ, చెట్ల కింద- మైదానం వంటి ప్రాంతాల్లో వుండరాదని అధికారులు సూచిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారుతెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఇప్పటికే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, దక్షిణ భారతదేశంలో నెమ్మదిగా అధికారాన్ని తిరిగి పొందుతోంది. తమిళనాడులో టీవీకేతో ఇటీవలి పొత్తు, కేరళలో అద్భుతంగా అధికారంలోకి రావడం వంటివి కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. వారు తమ ప్రాంతీయ అధ్యక్షురాలు షర్మిలకు సరైన రీతిలో మంచి ప్రతిఫలాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు షర్మిల నామినేషన్ ఖరారైనట్లు ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకరైన మల్లికార్జున ఖర్గే ధృవీకరించారు.

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గత కొంతకాలంగా అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తులవుతారు. క్రమంగా అనుకూలతలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సంతానానికి దూరప్రదేశంలో విద్యావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. తరచు బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురువారం నాడు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు ఇబ్బందికి గురిచేస్తారు. వృత్తుల వారికి సామాన్యం.