కుమారుడిని చూసి నవ్విన పాపానికి.. తండ్రిని హత్య చేశాడు.. ఎక్కడ?
Chittoor
జోకేశ్ రెడ్డి తరచుగా మద్యం సేవించి తన భార్యను వేధించేవాడు. ఒక రాత్రి అతను మద్యం మత్తులో ఇంటికి వచ్చినప్పుడు, అతని భార్య చెంగారెడ్డికి ఫోన్ చేసి, "మీ అబ్బాయి మద్యం తాగి మమ్మల్ని వేధిస్తున్నాడు. మీరు వచ్చి అతనికి బుద్ధి చెప్పి, ఇక్కడి నుంచి తీసుకెళ్లండి" అని చెప్పింది.
అప్పుడు జోకేశ్ రెడ్డి తన భార్య చేతి నుంచి ఫోన్ తీసుకుని, తన తండ్రిని కలవడానికి బైక్‌పై మాణిక్యరాయనిపల్లెకు వస్తున్నట్లు చెప్పాడు. అయితే, తండ్రి తనను చూసి నవ్వడంతో ఆగ్రహానికి గురైన జోకేశ్ రెడ్డి, కత్తితో అతని గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
