1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. West Bengal : Lover Knife Attack on Young Girl

బెంగాల్‌లో దారుణం... ప్రేమను తిరస్కరించిన యువతిపై కత్తితో దాడి (Video)

sadist
ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ  కిరాతక ప్రేమికుడు ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాష్ట్రంలోని బెల్గోరియాలో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన యువకుడుని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇదే.. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చెల్లి అంటూనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెరబట్టాడు : బాధితురాలు