1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Cinnamon: Health Benefits, Nutritional Information

దాల్చిన చెక్క టీతో కడుపు నొప్పి మటుమాయం

Cinnamon
మసాలా వంటకాల్లో మనం దాల్చిన చెక్కను విరివిగా వాడుతుంటాం. ఇది వంటకి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తరుచూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
 
గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయి. రోజుకు 2, 3 సార్లు దాల్చిన చెక్కని టీలో వేసుకుని తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పలు రకాల అల్సర్‌లను తగ్గించే గుణాలు దాల్చిన చెక్కలో చాలా ఉన్నాయి.
 
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లను శరీరం నుంచి బయటికి పంపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోగనివారిణిగా పనిచేస్తుంది.
 
కండరాల నొప్పులను, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలను తొలగిస్తుంది. జలుబు, గొంతు సమస్యలు, దగ్గు తగ్గుతాయి.
 
నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. 
About Writer
chitra