1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. drinking coconut water empty stomach benefits

ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగితే?

coconut water
ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
కొబ్బరి నీరులో పొటాషియం, అధిక స్థాయిలో బయోయాక్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. వీటివల్ల ఎక్కువ కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సాయపడతాయి.
 
కొబ్బరి నీరులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీనితో డీహైడ్రేషన్ లేకుండా ఈ నీరు మేలు చేస్తాయి.
 
కొబ్బరి నీరు 94% నీరు, పూర్తిగా కొవ్వు రహిత, కొలెస్ట్రాల్ రహితంగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు.
 
కిడ్నీలో రాళ్లను నివారించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం కీలకం. ఈ విషయంలోకొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తాయి.
 
యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల మొటిమలకు వ్యతిరేకంగా పోరాడడంలో కొబ్బరి నీరు గొప్ప సహాయం చేస్తాయి.
 
కొబ్బరి నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం అవుతుంది.
 
కొబ్బరి నీరు-తేనెలో వున్న ఫైబర్ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ఉపయోగపడుతాయి. 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
రోజూ ఒక ముక్క జున్ను తింటే?