1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Female Aghori-s rampage at Ujjain cremation ground; police make arrest.

ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులు

Lady Aghori Arrested
తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య మెడలో పుర్రెలు వేసుకుని హల్చల్ చేసిన లేడీ అఘోరి ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని శ్మశాన వాటికలో కనిపించింది. చేతిలో కత్తి పట్టుకుని మండుతున్న శవం నుంచి ఒక పదార్థాన్ని తీసి... ఇది చాలా వేడిగా రుచిగా వుందంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఇన్ స్టాగ్రాంలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
 
హిందూ మతపెద్దలు ఈ చర్యను ఖండించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు. అఘోరీ చర్యలు హిందూ మతాన్ని కళంకితం చేసేవిగా వున్నాయంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో స్థానిక నగర పోలీస్ సూపరిండెంట్ పుష్ప ప్రసాద్ లేడీ అఘోరీని అరెస్టు చేసారు. ఈ ట్రాన్స్ జెండర్ పైన బీఎన్ఎస్ సెక్షన్ 301 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అఘోరీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండుకి తరలించారు.
 
ఈ లేడీ అఘోరీ నుంచి కారును స్వాధీనం చేసుకోగా అందులో పెద్దయెత్తున మానవ పుర్రెలు వున్నట్లు తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నట్లు సమాచారం. 27 ఏళ్ల వయసున్న ఈ ట్రాన్స్‌జెండర్ అఘోరీ తెలంగాణలోని మంచిర్యాలకు చెందినది. ఈమె చిన్న వయసులోనే ఇంటిని విడిచిపెట్టింది.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు