సలార్ తో క్రష్ లిస్టులోకి జేరిన శ్రియా రెడ్డి
నటి శ్రియారెడ్డి సలార్ సినిమాతో ఒక్కసారిగా అందరి ద్రుష్టి ఆకర్షించింది. పొగురుగా వున్న రాధారమ పాత్రను పోషించింది. ఒకప్పుడు రమ్యక్రిష్ణ నటించిన నీలాంబరి పాత్రను పోలి వుంటుంది. అయితే అంతకుమించి అన్నట్లు ఈ పాత్ర వుంటుంది. అందులో రజనీకాంత్ పై ఈర్ష, కసితో నీలాంబరి పాత్ర పన్నాగాలు పన్నుతుంది. ఈ సలార్ లో శ్రియారెడ్డి.. తన సోధరుడు ప్రుధ్వీరాజ్ ను చంపే ప్లాన్ లో ప్రభాస్ అడ్డుపడడంతో అతన్ని చంపాలనే ప్లాన్ వేస్తుంది. అది ఎలా అనేది చూడాలంటే పార్ట్-౨లో చూడాల్సిందే.
Shriya Reddy, prashanth neel
అయితే, రాధారమ పాత్రతో ఒక్కసారిగా రష్మకి ప్లేస్ లో జేరింది. క్రష్ లిస్టులో చేరిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. గతంలో తమిళ హీరో విశాల్ నటించిన తిరిమి (పొగరు) లో నటించింది. దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత శ్రియకు సాలార్ తిరిగి వస్తున్న చిత్రం, ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ సినిమాలో తన కాస్ట్యూమ్స్ కు మంచి పేరు వచ్చిందనీ తన డిజైనర్ శ్రియాకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పాత్ర ఎలా వుండాలి అనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరించిన విధానంతో అస్సలు మిస్ కాకూడదు అనిపించిందని ఓ ఇంటర్యూలో తెలియజేసింది.