శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (16:59 IST)

ఎ సర్టిఫికెట్ తో సెన్సార్ పూర్తయిన ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్

prabhas-salar
prabhas-salar
ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్‌’ చిత్రం నేడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎ సర్టిఫికెట్ తో డిసెంబర్ 22వ తేదీ నుండి సినిమా థియేటర్‌లలో రాబోతుంది. ఇద్దరు స్నేహితుల కథతో ఈ చిత్రం రూపొందిందని ఇటీవలే ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ప్రభాస్ స్నేహితుడిగా మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించాడు. 
 
పూర్తి యాక్షన్ సినిమా గా వైలెన్స్ ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సెన్సార్ సభ్యులు తెలిపారు.  ఐదు భాషల్లో తమ పాత్రలకు ప్రభాస్, పృథ్వీరాజ్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రమిది. శృతిహాసన్, జగపతి బాబు,  శ్రీయారెడ్డి తదిరులు నటించారు. భారీ తారాగణం నటించిన ఈ సినిమా విడుదలకు బాలీవుడ్ సినిమా దంకీ కూడా విడుదలకాకుండా చేశారని తెలుస్తోంది.