ఉస్మానియాలో కరోనా కలకలం.. 12మంది విద్యార్థులకు కరోనా..!
కరోనా వైరస్ జనాలను వణికిస్తోంది. తెలంగాణలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉస్మానియాలో కరోనా కలకలం రేపింది. ఉస్మానియాలోని 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.
296 మంది విద్యార్థులు కళాశాలలోనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో, కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉన్నది.
కాగా.. కరోనా నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.