శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 మే 2017 (17:16 IST)

ఫేస్‌బుక్ పరిచయం... కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు.. గ్యాంగ్ రేప్.. ఐదుగురి అరెస్ట్

సోషల్ మీడియాలో ఏర్పడిన స్నేహంతో ఓ యువతి గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఫేస్ బుక్‌లో ఏర్పడిన పరిచయంతో శ్రీకాంత్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి గొంతుకోశాడు. నిందితులపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్య

సోషల్ మీడియాలో ఏర్పడిన స్నేహంతో ఓ యువతి గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఫేస్ బుక్‌లో ఏర్పడిన పరిచయంతో శ్రీకాంత్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి గొంతుకోశాడు. నిందితులపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఫేస్ బుక్‌లో ఓ యువతితో పరిచయమైంది. వీరిద్దరూ కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు.
 
బీటేక్ చదువుతున్న యువతిని ఈ నెల 16వ తేదీన రాత్రి బీఆర్ టీఎస్ రోడ్డులో శ్రీకాంత్ అతని స్నేహితులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లారు. కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు ఇచ్చి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచారానికి అనంతరం బాధితురాలిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్, అభిషేక్, పవన్, సునీల్, అఖిల్‌లను అరెస్ట్ చేశారు.