శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (17:59 IST)

గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌.. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. సీలింగ్‌ ఫ్యాన్‌కు?

suicide
విశాఖపట్నంలో బుధవారం 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌ చేస్తూ బాలికను ఆమె తల్లి అన్నపూర్ణ మందలించడంతో మధురవాడలోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భర్త మహేశ్ మృతి చెందడంతో బాలికకు అన్నపూర్ణ సింగిల్ పేరెంట్ అని తెలిసింది. బాలిక తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.