గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (20:39 IST)

ఆయేషా మీరా హత్య, నిందితుడు సత్యం బాబే... వదిలేది లేదు... సుప్రీంకోర్టుకు వెళతాం...

ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చిన సత్యం బాబు నిందితుడేనంటున్నారు ఆ కేసు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్. అతడే నిందితుడు అనేందుకు ఆధారాలున్నాయని అంటున్నారు. దీనిపై మాట్లాడుతూ... కృష్ణా జిల్లా నందిగామలో చిన్నచిన్న హాస్టళ్లు చాలా వున్నాయనీ

ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చిన సత్యం బాబు నిందితుడేనంటున్నారు ఆ కేసు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్. అతడే నిందితుడు అనేందుకు ఆధారాలున్నాయని అంటున్నారు. దీనిపై మాట్లాడుతూ... కృష్ణా జిల్లా నందిగామలో చిన్నచిన్న హాస్టళ్లు చాలా వున్నాయనీ, అక్కడ మహిళల్ని ఇబ్బందిపెట్టే సంఘటనలు కొన్ని జరిగాయాన్నారు. 
 
ఐతే ఆయేషా హత్య తర్వాత అవన్నీ ఆగిపోయాయనీ, ఆ క్రమంలో తాము దర్యాప్తు చేపట్టి ఇలాంటి దారుణాలకు ఎవరు పాల్పడతారంటూ చూస్తే అతనే దోషి అని తేలిందన్నారు. సత్యం బాబును విచారించిన సమయంలో అతడు చేసిన దారుణాలను కళ్లకు కట్టినట్లు చెప్పినట్లు వెల్లడించారు. పైగా ఆయేషా శవం వద్ద రక్తపు మరకలతో సత్యం బాబు డీఎన్ఎ సరిపోలిందనీ, అవన్నీ చూసిన మీదట సత్యం బాబును దోషి అని కోర్టు ముందు నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. 
 
కాగా సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు. పోలీసులు ఎన్నో వేల కేసులు డీల్ చేస్తుంటారనీ, ఐతే టెక్నికల్‌గా ఎక్కడో తేడా జరిగి వుండొచ్చనీ, అలాగే చిన్నచిన్న పొరబాటులు జరగవచ్చనీ, ఐతే కేసు విషయంలో తాము సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలియజేశారు.