శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (20:18 IST)

విశాఖలో రెవిన్యూ సర్వేయర్‌ను పట్టేసిన ఏసీబి

విశాఖజి ల్లాలో రెవెన్యూ సర్వేయర్ అడ్డంగా బుక్కయ్యాడు. మూడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో వెంకట్రావ్ అనే రైతులు వ్యవసాయ భూమి వుంది. 
 
కొద్దికాలం క్రితం అతడు మరణించడంతో మ్యూటేషన్ కోసం వెంకట్రావ్ భార్య మహేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఆ భూమిని సర్వేచేసి నిర్ధారించేందుకు సర్వేయర్ సువ్వరపు జగన్నాథరావ్ ...ఐదు వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. మూడువేల రూపాయలకు బేరం కుదుర్చుకుని నగదు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు.