బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (19:30 IST)

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బ్రహ్మసముద్రం మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశులు కుమార్తె అనూషకు గార్లదిన్నె మండలం కొట్టాలపల్లికి చెందిన వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అదే మండలంలోని కొప్పలకొండకు చెందిన కురుబ లింగమయ్యతో గతకొంత కాలంగా అనూష వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చేది. 
 
ఆమె ఇటీవల పుట్టింటికి వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని లింగమయ్య రాయలప్పదొడ్డి గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడమే కాకుండా అత్యాచారం కూడా చేశాడు. 
 
దీన్ని గమనించిన కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా కత్తితో దాడి చేసేందుకు యత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ కామాంధుడుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.