ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (12:25 IST)

ఏపీలో గ్రామ వలంటీర్లకు శుభవార్త చెప్పిన మంత్రి విశ్వరూప్

pinepe vishwaroop
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్లకు శుభవార్త చెప్పింది. వేతనం పెంపుపై కీలక ప్రకటన చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నట్టు వివరించారు. 
 
కోనసీమ జిల్లాలో అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి, వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్‌లోకి వస్తే వలంటీర్‌ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పుకొచ్చారు. 
 
సీఎం జగన్‌ త్వరలోనే వలంటీర్లపై దృష్టిసారించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలక. వలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే విషయంపై త్వరలోనే నివేదిక తీసుకునే అవకాశం ఉంది. ఆపై జిల్లా వారీగా వలంటీర్లతో నేరుగా ముఖ్యమంత్రే మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.