సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (17:16 IST)

మళ్లీ చర్చలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడుగుతాం

పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో తాము ఆశించినట్టుగా లేదని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడుగుతామని, తమను మళ్లీ చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

 
మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోందన్నారు. అయితే ప్రతి మీటింగ్‌లోనూ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

 
ఈ జీవోపై ఉద్యోగులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ జీవో ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉందని, ఈ జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.


తమ సమస్యలను సీఎంవో దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వం స్పందన చూసి.. ఇవాళ సాయంత్రం ఉద్యోగులతో సమావేశం నిర్వహించి నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.