శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (17:56 IST)

దీపావళి రోజున శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. ఏంటది?

దీపావళి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఏపీలోని పర్యాటకులకు ఇది ఎంతో మంచి శుభవార్త. రాష్ట్రంలో ఉన్న నదుల్లో బోటు షికారుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.
 
ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన పర్యాటకం తిరిగి తెరుచుకుంటున్నాయి. 
 
బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు.