సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2016 (16:09 IST)

తెదేపాలో అలాంటివారు 20 మంది ఎమ్మెల్యేలు... సీల్డు క‌వ‌ర్ల‌తో షాకిచ్చిన చంద్ర‌బాబు...

విజ‌య‌వాడ‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌మ ఎమ్మెల్యేల‌కు షాక్ ఇచ్చారు. మూడు రోజుల వ‌ర్క్ షాప్ క్లాసులు ముగిసిన తరువాత చివర్లో సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు ఇచ్చారు. టెన్షన్‌తో సీక్రెట్‌గా కవర్లను ఓపెన్ చేసి చూస్తే ఏముంది... ప‌ని తీరు

విజ‌య‌వాడ‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌మ ఎమ్మెల్యేల‌కు షాక్ ఇచ్చారు. మూడు రోజుల వ‌ర్క్ షాప్ క్లాసులు ముగిసిన తరువాత చివర్లో సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు ఇచ్చారు. టెన్షన్‌తో సీక్రెట్‌గా కవర్లను ఓపెన్ చేసి చూస్తే ఏముంది... ప‌ని తీరు వెరీ బ్యాడ్... ర్యాంక్ వెరీ పూర్... దీనితో ఎవ‌రికివారు కుక్కిన పేనులా మారిపోయారు. మంచి ర్యాంకు వచ్చిన వాళ్లు నోళ్లు విప్పుతున్నారు. పూర్ ర్యాంకుకు పరిమితం అయిన వాళ్లు గప్‌చిప్‌గా ఉన్నారు.
 
ఇలా ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల పనితీరు మీద సర్వేలు చేయించ‌డం చంద్రబాబుకు ఎప్ప‌టి నుంచో అలవాటు. ప్రతి నెలా పనితీరును బేరీజు వేస్తుంటారు. నియోజకవర్గాల వారీగా చేసిన సర్వేలపై సమీక్షించారు. పార్టీ పరంగా చేసుకున్న సర్వే, నిఘా వర్గాల సర్వే, నిపుణులతో చేసిన సర్వే... మూడింటినీ క్రోడీకరించి ఫైనల్ ర్యాంకు ఇస్తారు. ఎమ్మెల్యేలకు ఫైనల్ ర్యాంకుల్ని సీల్డ్ కవర్లో ఇచ్చారు. వాటి ఆధారంగా ఇక నుంచి ఎమ్మెల్యేలు వాళ్ల తీరును మార్చుకోవాలి. 
 
ప్రతినెలా ఎమ్మెల్యే పురోగతిని చంద్రబాబు లెక్కిస్తున్నారు. విద్యార్ధులకు మూడు, ఆరు, సంవత్సర పరీక్షల మాదిరిగా ర్యాంకుల్ని ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. ఫైనల్‌గా ఐదేళ్ల ర్యాంకులను క్రోడీకరించి 2019 టిక్కెట్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆ వ్యూహంతో చంద్రబాబు వెళుతున్నారు.
 
ప్రస్తుతం చేసిన సర్వేల ఆధారంగా నాలుగు విభాగాలుగా ర్యాంకులను కేటాయించారు. ఏ,బీ,సీ,డీ ర్యాంకులను ఇచ్చారు. సీ,డీ ర్యాంకులు వచ్చిన ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవాలి. లేదంటే భవిష్యత్ రాజకీయానికి ప్రమాదం ఏర్పడినట్టే. పలు రకాల అంశాలను ర్యాంకు కోసం తీసుకున్నారు. వాటిలో మొదటిది ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? లేదా? రెండోది ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తున్నారా? మూడోది ఆరోపణల్లోని నిజాలు ఏంటి? ఇలాంటి సుమారు 12 అంశాలను తీసుకుని సర్వే చేయించారని తెలిసింది. 
 
వ్యక్తిగత లైఫ్ గురించి కూడా సర్వే ద్వారా ఆరా తీశారట‌. ప్రైవేటు లైఫ్ మీద కూడా సర్వేలోని పాయింట్ జోడించారట. దాని మీద సర్వే చేయించడంతో పాటు సంబంధిత ఎమ్మెల్యేకు పార్టీ కేంద్ర కార్యాలయం హెచ్చరిస్తోందట. ఆ విషయం తెలుసుకున్న కొందరు ఎమ్మెల్యేలు ఉలిక్కిపడ్డారని పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
నాలుగు ర్యాంకుల కన్నా దిగువ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ఇక వాళ్లకు టీడీపీలో స్థానం కష్టమేనని పార్టీ అంతర్గత వర్గాల భావన. అలాంటి వాళ్లు సుమారు 20 మంది వరకు ఉన్నారని స‌మాచారం. ఆ 20 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరచడానికి పార్టీ నేరుగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది.