అద్దె గర్భం దాలిస్తే రూ.2.5 లక్షలిస్తామన్నారు.. ప్రసవమయ్యాక ఛీత్కరించారు...
తాజాగా మరో రకం మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె గర్భం పేరుతో మోసం చేశారు. అద్దె గర్భం దాల్చితే రూ.2.5 లక్షలిస్తామని చెప్పారు. తీరా ప్రసవించాక ఛీత్కరించారు. దీంతో రమా టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌పై లోక్
తాజాగా మరో రకం మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె గర్భం పేరుతో మోసం చేశారు. అద్దె గర్భం దాల్చితే రూ.2.5 లక్షలిస్తామని చెప్పారు. తీరా ప్రసవించాక ఛీత్కరించారు. దీంతో రమా టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌పై లోక్ అదాలత్‌లో కడప మహిళ ఫిర్యాదు చేయగా, ఆ సెంటర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.
కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన రమణయ్య, రమాదేవి భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు కలిగిన తర్వాత మనస్పర్థలు ఏర్పడటంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే, పిల్లలను పోషించేందుకు ఉద్యోగం కోసం రమాదేవి ప్రయత్నిస్తుండగా హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోగల రమా టెస్ట్‌ట్యూబ్ సెంటర్‌లో ఉద్యోగాలు ఉన్నాయని ఆసక్తిగలవారు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఓ పేపర్‌లో ప్రకటన వచ్చింది.
ఈ ఇంటర్వ్యూకు రమాదేవి హాజరయ్యారు. అపుడు రమాదేవికి ఎవరూ లేరనే విషయం టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహకులు తెలుసుకున్నారు. అద్దె గర్భం దాలిస్తే ఒక సంవత్సరంపాటు సకల సౌకర్యవంతమైన జీవితం కల్పిస్తామని, రూ.2,50,000లు ఇస్తామని ఆశ చూపారు. పిల్లలను పోషించే శక్తి లేక తప్పని పరిస్థితిలో అద్దె గర్భం ధరించడానికి అంగీకరించింది.
ఆ తర్వాత అమీర్‌పేటలోని బేబీ సెంటర్ ఎదురుగా ఉన్న సాయి లక్ష్మి ఉమెన్స్ హాస్టల్‌లో ఆమెను చేర్పించారు. ప్రసవం అయ్యాక ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు కదా.. ఆమెను ఛీత్కరించారు. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయస్థితిలో కడపకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కడ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ న్యాయాధికారులను కలిసి... హైదరాబాద్ ఆమీర్‌పేటలోని రమాదేవీ టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనలాంటి మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని అని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లోక్ అదాలత్ (జిల్లా న్యాయసేవా సాధికార సంస్ధ) కార్యదర్శి యు.యు. ప్రసాద్ రమా టెస్టుట్యూబ్ బేబీ సెంటర్‌కు నోటీసులు జారీచేశారు.