ఫేస్‌బుక్ మోసం.. ఏడాది పరిచయం రూ.6లక్షల దాకా టోకరా..
ఫేస్‌బుక్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు.
ఫేస్‌బుక్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తుండల పరిధిలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన జె.జశ్వంత్ వర్ధన్ రాజు వైజాగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో హేమశ్రీ అనే అమ్మాయితో పరిచయమైంది. ఈ పరిచయం ఏడాది పాటు సాగింది. ఈ పరిచయంతో నమ్మించి ల్యాప్‌ట్యాప్, రెండుజతల బంగారు గాజులు, చైను, నగదు మొత్తం రూ.4లక్షల వరకు జశ్వంత్ వర్ధన్ రాజు టోకరా వేశాడని పోలీసులు ఫిర్యాదు చేసింది.
అంతేగాకుండా తమ ఇద్దరికి స్నేహితుడైన నర్సరావుపేట సమీప ప్రాంత వాసి వినయ్ చౌదరిని కూడా నమ్మించి రూ. 1.6 లక్షలు తీసుకుని జశ్వంత్ వర్ధన్‌రాజు మోసగించినట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.