సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:05 IST)

కాకినాడ జీఎంఆర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ ప్లాంట్ గత కొన్నేళ్ల క్రితం మూసి వేశారు. 
 
దీంతో ఈ ప్లాంట్‌లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ ప్లాంట్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు. పవర్‌ప్లాంట్‌లోని సుమారు 70 శాతం నిర్మాణ సామగ్రి కాలిబూడిదైనట్లు తెలుస్తోంది.