జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: నాదెండ్ల మనోహర్
వైద్య సేవలో ఉన్నవారిపై జూనియర్ అధికారులతో కర్ర పెత్తనం చేయించాలనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైద్యుల గౌరవాన్ని తగ్గించే ఉత్తర్వులు సరికాదన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మందుల సరఫరాపై దృష్టిపెట్టాలని సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచిపోయిందని విమర్శించారు.
ప్రభుత్వ వైద్యులపై పెత్తనం చేసే అధికారాన్ని జాయింట్ కలెక్టర్-2కి అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయం వైద్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై కర్ర పెత్తనం చేసేందుకే ఉత్సాహపడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.