శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (10:16 IST)

కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆసుపత్రి గుర్తింపు రద్దు: హోంమంత్రి హెచ్చరిక

కరోనా లక్షణాలున్న వ్యక్తులను తిరిగి పంపితే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై చర్య తీసుకుంటామని హోంమంత్రి సుచరిత ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.

కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా కూడా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. "కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం.

నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తాం, హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని కోరుతున్నాం’’ అని సుచరిత ట్వీట్‌లో పేర్కొన్నారు.